Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఆల‌యాల్లో అభివృద్ధి పనులు వేగ‌వంతం

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (15:45 IST)
టిటిడి ప‌రిధిలో ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల ఆల‌యాల్లో అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ అధికారుల‌ను ఆదేశించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఆయా ఆల‌యాల అధికారుల‌తో జెఈవో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా క‌న్యాకుమారి, చెన్నై, ముంబ‌యి, ఢిల్లీ, కురుక్షేత్ర‌, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లోని ఆల‌యాల్లో జ‌రుగుతున్న ఇంజినీరింగ్ ప‌నుల పురోగ‌తిని జెఈవో అడిగి తెలుసుకున్నారు.

క‌ల్యాణ‌మండ‌పాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని, డార్మెట‌రీలు, వ‌స‌తిగ‌దుల వ‌ద్ద నీటి కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఆల‌య కార్యాల‌యాల్లో కాగిత‌ర‌హిత పాల‌న సాగించాల‌ని, ఇఆర్‌పిని అమ‌లు చేయాల‌ని, అంత‌ర్గ‌త ఆడిట్ త‌ప్ప‌కుండా చేయాల‌ని ఆదేశించారు.

సిబ్బంది కొర‌త‌, పెండింగ్‌లో ఉన్న ప‌నుల పురోగ‌తి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. ఇక‌పై జ‌రిగే వీడియో కాన్ఫ‌రెన్సుల్లో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాల‌న్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజి, అద‌న‌పు ఎఫ్ఏసిఏవో ర‌విప్ర‌సాదు, సిఏవో శేష‌శైలేంద్ర‌, డెప్యూటీ ఈవో(జ‌న‌ర‌ల్‌) సుధారాణి, ఇడిపి ఓఎస్‌డి వేంక‌టేశ్వ‌ర్లు నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments