Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పున‌రుద్ధ‌రించ‌లేదు : టిటిడి

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:39 IST)
కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువ‌ల్ల వీరి ద‌ర్శ‌నాల విష‌యంలో ఇదే స్థితి కొన‌సాగుతోంది.
 
అయితే గ‌త కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో తిరుమ‌ల‌లో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవాస్త‌వ స‌మాచారం ట్రోల్ అవుతోంది. అనేకమంది ఇది నిజ‌మ‌ని న‌మ్మి తిరుపతికి  వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది. భ‌క్తులు ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

కోవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చాక ఈ ద‌ర్శ‌నాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై త‌గిన నిర్ణ‌యం తీసుకుని మీడియా ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అవాస్త‌వ స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి కోరుతోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments