పోస్టల్​ డిపాజిట్లు ఇక సులభతరం.. కొత్త ఐవీఆర్‌ సిస్టమ్, ట్రోల్​ ఫ్రీ కూడా..

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (22:36 IST)
ఇండియన్​ పోస్ట్​ పేమెంట్ బ్యాంక్‌​లో సేవింగ్స్​ అకౌంట్​ గల కస్టమర్లకు శుభవార్త. పోస్టల్​ డిపాజిట్లను సులభతరం చేసేందుకు పోస్టల్​ విభాగం తాజాగా కొత్త ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) సిస్టమ్​ను ఆవిష్కరించింది. మొబైల్ ఫోన్​ ద్వారానే ఈ కొత్త సదుపాయాన్ని పొందవచ్చు.

ఈ కొత్త ఐవీఆర్​ సేవతో మీ పోస్టల్​ పెట్టుబడులకు సంపాదించిన వడ్డీ, బ్యాలెన్స్​, డిపాజిట్​ వివరాలు, ఏటీఎమ్​ కార్డ్ బ్లాకింగ్, సౌకర్యాలు, కొత్త కార్డుల జారీతో పాటు వివిధ పోస్టల్ సేవింగ్ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
 
డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పీపీఎఫ్​, ఎన్​ఎస్​సీ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు 18002666868 ట్రోల్​ ఫ్రీ నంబర్​కు కాల్​ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
 
ఈ ఐవీఆర్​ ఫెసిలిటీలో 1 నంబర్​ నొక్కితే హిందీలో సమాచారం వస్తుంది. 2 నంబర్​ నొక్కితే ఇంగ్లీష్​లో సమాచారం వస్తుంది. మరోవైపు, దీని ద్వారా పోస్టల్​ డెలివరీ సేవలు, రిజిస్టర్​ పోస్ట్​ సేవలు, జీవిత బీమా ప్రీమియం గడువు తేదీ, ప్రీమియం మొత్తం, పాలసీ స్టేటస్​, పాలసీ మెచ్యూరిటీ తేది, హామీ మొత్తం, బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​ సేవలు అన్ని పథకాల్లో ఖాతా బ్యాలెన్స్​, డెబిట్​ కార్డు సేవలు, పోస్టాఫీస్​ అందించే పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇంకా పలు రకాల ఇతర సేవల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments