Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగలకు ప్రత్యేక రైళ్లు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:16 IST)
పండగ సమయంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా రోజుల్లో అదనపు సర్వీసులతో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో... దక్షిణ మధ్య రైల్వే 178 ప్రత్యేక రైళ్లను నడునున్నట్లు రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి రాకేశ్​ తెలిపారు. తిరుపతి-నాగర్‌సోల్‌-తిరుపతి మధ్య 26 వీక్లీ రైళ్లు నడుపుతామన్నారు.

వీటిని జనవరి 3,10,17,24,31 ఫిబ్రవరి 7,14,21,28 మార్చి 6,13,20, 27 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. నాగర్ సోల్-తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను జనవరి 4,11,18,25 ఫిబ్రవరి 1,8,15,22,29 మార్చి 7,14,21,28 తేదీల్లో నడుపుతామని తెలిపారు. 
 
నాందేడ్-తిరుపతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను... జనవరి 7,14,21,28, ఫిబ్రవరి 4,11,18,25 మార్చి 3,10,17,24,31 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. తిరుపతి-నాందేడ్ మధ్య జనవరిలో 8,15,22,29, ఫిబ్రవరి 5,12,19,26 మార్చి 4,11,18, 25, ఏప్రిల్ 1న కూడా ఈ రైళ్లను నడుపుతున్నారు. 
 
నర్సాపూర్-హైదరాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-మచిలీపట్నం-కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నర్సాపూర్-హైదరాబాద్ మధ్య 3, హైదరాబాద్-విజయవాడ మధ్య 4, మచిలీపట్నం-సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య 7, కాచిగూడ-కాకినాడటౌన్-కాచిగూడ మధ్య 7 ప్రత్యేక సర్వీసుల సేవలు అందించనున్నట్లు తెలిపారు. జనసాధరణ్, 10 సువిధ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాతాలకు నడపనున్నారు.

నర్సాపూర్-హైదరాబాద్ మధ్య ఒక సువిధ, సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ఒక సువిధ సర్వీసు, కాచిగూడ-కాకినాడటౌన్-కాచిగూడ మధ్య రెండు సువిధ సర్వీసులు, విజయవాడ-విజయనగరం మధ్య ఆరు జనసాధరణ్ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. తిరుపతి-కరీంనగర్ మధ్య 78 ప్రత్యేక సర్వీసులను వారంలో మూడు రోజులపాటు నడపనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments