Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడపలో 10 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు

కడపలో 10 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు
, గురువారం, 19 డిశెంబరు 2019 (06:01 IST)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలను కడప జిల్లాలో గుర్తించారు. ఇవి దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

కడప జిల్లా చింతకుంటలో బయటపడ్డ ఆదిమానవుల రేఖా చిత్రాలు అరుదైనవని.. తిరుపతి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు శివకుమార్​ తెలిపారు. ఇవి మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని భీమ్​ ఖేత్కాలో ఉన్న చిత్రాల మాదిరి ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలు ఒకే చోట భారీ సంఖ్యలో వుండడం సంతోషదాయకమన్నారు. ఈ రేఖా చిత్రాలు దాదాపు 10 వేల సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.

ఈ ప్రదేశాన్ని తొలుత విశ్రాంత ఐఏఎస్​ అధికారి గోపాలకృష్ణ గుర్తించారు. దీన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్​ పురావస్తు కమిషనర్​ శ్రీమతి వాణిమోహన్​ను కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు: నీలం సాహ్ని