Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట నిలబెట్టుకున్న సోనూసూద్ ... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (12:58 IST)
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడైన బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోమారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీలోని నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆత్మకూరు ఆస్పత్రి కోసం ఆక్సిజన్ ప్లాంట్ కొనుగోలు చేసి, రోడ్డు మార్గాన పంపించారు.
 
తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్​ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. ఈ ప్లాంట్​ను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఇప్పటికే.. రోడ్డు మార్గాన బయలుదేరిందని, రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి వారం రోజుల్లో ఆత్మకూరుకు చేరుకుంటుందని సోనూసూద్ మిత్రులు తెలిపారు.
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆక్సిజన్​ ప్లాంట్లు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఏపీలోని నెల్లూరు, కర్నూలు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్​లో సహా పలు రాష్ట్రాల్లో సోనూ, ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
 
కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతో మందికి సోనూ సేవలు అందిస్తూనే ఉన్నారు. గతేడాది వలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా తనని సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆపన్నహస్తం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments