Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినను తిట్టిన తండ్రి.... ఆగ్రహంతో చంపేసిన కొడుకు...

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:31 IST)
క్షణికావేశంలో కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. కట్టుకున్న భార్య అయినా, కన్న తండ్రి అయినా సరే ఆవేశంలో హత్యలు చేసేస్తుంటారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో జరిగింది. తన వదినను కొట్టాడన్న కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు తన తండ్రిని గోడకేసి బాది అతి దారుణంగా చంపేశాడు. 
 
వి.కోట మండల పరిధిలోని పాముగాని పల్లె పంచాయతీ కొత్తచిన్నేపల్లి గ్రామానికి చెందిన సల్లా పూరెప్పకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అంజప్ప సంరక్షణలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు వెంకటరమణ జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. అంజప్ప భార్య షబానా ఇంట్లో మటన్ కర్రీ చేసింది. సల్లా వూరెప్ప తనకు మాంసం కూర పెట్టలేదని కోడలు షబానాతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న వెంకటరమణ వదిననే తిడతావా అంటూ తండ్రి సల్లాపూరెడ్డిని గోడకేసి కొట్టి హతమార్చాడు. 
 
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments