డబ్బు కోసం ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్న ఈ కాలంలో తల్లిదండ్రులకు కూడా ముప్పు తప్పడం లేదు. డబ్బు కోసం కన్న కొడుకు తల్లిదండ్రులను చితకబాదాడు. ప్రక్క వారికి ఉన్న కనికరం కూడా అతనికి లేకపోయింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన నక్కా రంగయ్య దంపతులు ఐదు లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. డబ్బు తెచ్చివ్వమని కొడుకు వారితో ఇప్పటికే చాలాసార్లు గొడవపడ్డాడు. ఇదేవిధంగా మరోమారు వేధించసాగాడు. ఆ వృద్ధులు దాని ఒప్పుకోకపోవడంతో పైశాచికంగా ప్రవర్తించాడు.
కర్ర తీసుకుని చితకబాదాడు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఈ విషయం తెలియడంతో దారుణానికి దిగిన కొడుకుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.