Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలి: సోము వీర్రాజు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (16:13 IST)
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమను మట్టుబెట్టేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాని కోరారు. అలాగే రాష్ట్రంలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలని డిమాండ్ చేశారు. 
 
2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జోస్యం చెప్పారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రూ.75లకు చీప్ లిక్కర్ అమ్మనుందని స్పష్టం చేశారు. 
 
ప్రజాగ్రహ సభ ద్వారా తమ సత్తా ఏంటో చూపిస్తామని కామెంట్ చేశారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
గతంలో అంచనాలు పెంచేశారని చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారని ప్ర‌శ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పదవులు ఆశించి పని చేయలేదని.. తనకు సీఎం అవ్వాలని లేదని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments