పొత్తులపై మేమిద్దరం మంచి క్లారిటీతోనే ఉన్నాం : సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులపై ఏపీ శాఖ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. పొత్తుల అంశంలో తాను, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఓ పక్కా క్లారిటీతోనే ఉన్నామని చెప్పారు. 
 
కాగా, మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో తన ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్  ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ, బీజేపీతో పొత్తులే ఉన్నాం అంటూ ఓ సందిగ్ధత వ్యక్తం చేశారు. 
 
ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖాయమనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుపై పవన్ అస్పష్టంగా వ్యాఖ్యానించగా, వీటిపై సోము వీర్రాజు స్పందించారు. పొత్తులపై తామిద్దరం ఓ క్లారిటీతోనే ఉన్నామన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదన్నారు. 
 
తొలుత తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని వ్యాఖ్యానించి సోము వీర్రాజు.. ఆ తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యల అనంతరం తన మాటలను ఆయన సవరించుకోవడం గమనార్హం. కాగా, ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య గత కొంతకాలంగా ఉమ్మడి కార్యాచరణ అంటూ ఏదీ లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా లేదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments