Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లా జవాను వీరమరణం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:12 IST)
జమ్ముకశ్మీర్‌ రాజోరి జిల్లాలోని సుందర్‌బాని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి(23) వీరమరణం పొందారు. ఈ మేరకు పట్టణంలోని దరివాద కొత్తపాలెంలోని తల్లిదండ్రులకు శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ అధికారులు సమాచారం అందించారు.

జశ్వంత్‌ 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరారు.తొలుత నీలగిరిలో పనిచేసిన ఈయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు.మరో నెలరోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతదేహం శుక్రవారం రాత్రికి బాపట్ల చేరుకోవచ్చని అధికారుల నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టగా.. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments