Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్టిస్ ఫర్ ప్రణయ్-అమృతవర్షిణిని అలా కామెంట్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..

ప్రేమ వివాహం చేసుకుని కొద్ది నెలలకే భర్తను కోల్పోయిన అమృత వర్షిణిని కించపరుస్తూ.. కామెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (16:07 IST)
ప్రేమ వివాహం చేసుకుని కొద్ది నెలలకే భర్తను కోల్పోయిన అమృత వర్షిణిని కించపరుస్తూ.. కామెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేసింది. ఈ ఫేస్‌బుక్ పేజీకి వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. 
 
కానీ అమృత వర్షిణికి కొందరు బాసటగా నిలిచినా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అసభ్యకరంగా కామెంట్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో అమృత వర్షిణి వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 
 
అమృత ఫిర్యాదుపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాస్‌ విచారణ చేపట్టాలని వన్‌టౌన్‌ పోలీసులను ఆదేశించారు. దీంతో ఐటీకోర్‌ టీమ్‌ సహకారంతో విచారణ మొదలుపెట్టిన సీఐ సదానాగరాజు అమృత వర్షిణిని కామెంట్‌ చేసిన యువకుడు రంగారెడ్డి జిల్లా దూలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గొట్టి ఈశ్వర్‌గా గుర్తించి ఐటీ అమెండెమెంట్‌ యాక్ట్‌, 354(డీ)ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
 
గొట్టి ఈశ్వర్‌ను స్వగ్రామంలోనే అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అంతేగాకుండా.. సోషల్‌ మీడియాలో ఇతరులను కామెంట్‌ చేస్తూ అసభ్యకర పదజాలంతో అవమాన పరిచేవిధంగా పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments