Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్, ఎక్కడ?

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (15:21 IST)
పుష్ప సినిమాలో మొత్తం ఎర్రచందనం గురించే చూపించారు. ఎర్రచందనం ఏవిధంగా స్మగ్లింగ్ చేస్తారు. ఎలా గోడౌన్లో దాచిపెడతారు. ఎంత భద్రంగా వాటిని విదేశాలకు తరలిస్తారోనన్నది స్పష్టంగా ఉంది. అయితే సినిమాలో ఏవిధంగా అయితే చూపించారో అదేవిధంగా తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడింది ఓ ముఠా. 

 
ఎర్రచందనంను అయితే ఏదో ఒక విధంగా తీసుకెళ్ళారు కానీ.. చివరలో విదేశాలకు పంపే సమయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని తిరుపతి టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది.

 
చెన్నై విమానాశ్రయానికి అతి సమీపంలో ఒక గోడౌన్‌ను ఏర్పాటు చేసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు తిరుపతిలోని కరకంబాడి సమీపం నుంచి ఎర్రచందనాన్ని తీసుకెళ్ళి భద్రపరిచారు. పుష్ప సినిమాలో ఏవిధంగా అయితే ఉందో అదే విధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది.

 
టాస్క్ ఫోర్స్‌కు వచ్చిన సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించి కరకంబాడిలో దాడులు చేసి నేరుగా చెన్నైకు వెళ్ళి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ఒకటిరెండు కాదు ఏకంగా 2 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని తిరుపతికి తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments