Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:38 IST)
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా 1 గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాలి. అయితే ఢిల్లీ పర్యటన ఆలస్యం కావడంతో సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకునే అవకాశం వుంది.
 
 5.30 గంటలకు ప్రధాని నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నమయ్య భవన్ నుంచి జగన్ పాల్గొనే అవకాశం ఉంది. పద్మావతి అతిధి గృహం సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 6.15 నిముషాలుకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఉరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రాత్రి 7.40 నిముషాలకు శ్రీవారి గరుడ వాహన దర్శనం చేసుకుని తిరిగి పద్మావతి పద్మావతి గృహంకు చేరుకుంటారు.
 
సీఎం జగన్ తిరుపతికి రానుండటంతో 
రాష్ట్ర మంత్రులు తిరుమల బాట పడుతున్నారు. 24వ తేది ఉదయం 6.15 నిమిషాలకు మరోసారి శ్రీవారిని దర్శించుకుని, ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నాదనీరాజనం మండపంలో సుందరకాండ పఠనంలో పాల్గొంటారు. అక్కడ నుంచి 8.10 నిముషాలుకు కర్నాటక చౌల్ట్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 9.20 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరతారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments