Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అరవింద సమేత' సినిమా చూసి పరారైన ఆరుగురు విద్యార్థులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (17:46 IST)
తిరుపతిలో ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూడాలన్న ఆ విద్యార్థుల తాపత్రయం కాస్తా తల్లిదండ్రులకు ఆందోళనకరంగా మారింది. పాఠశాలకని వెళ్ళిన విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో కంగారుపడుతున్నారు తల్లిదండ్రులు.  ప్రిన్సిపల్ వేధించడంతో ఆవేదనతో తమ పిల్లలు కనిపించకుండా పోయారంటున్నారు తల్లిదండ్రులు. 
 
తిరుపతిలో పాఠశాలకని వెళ్ళి అదృశ్యమైన ఆరుగురు విద్యార్థుల ఘటన కలకలం రేపుతోంది. నిన్న ఉదయం స్కూలుకు వెళతామని చెప్పి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వినయ్ కుమార్, పూజిత్ నాయక్, వంశీ, వినయ్, బాలాజీ, ప్రశాంత్‌లు ఇంట్లో చెప్పి వెళ్ళారు. వీరందరూ రైల్వే కాలనీలోని మాతృశ్రీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే రాత్రయినా విద్యార్థులు రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు పరుగులు తీశారు. 
 
అయితే అక్కడ ప్రిన్సిపల్ విద్యార్థుల విషయం తనకు తెలియదని, సినిమాకు వెళ్ళామని చెప్పడంతో ఇంట్లో చెప్పకుండా ఎందుకు వెళ్లారని మందలించినట్లు తెలిపారు. కానీ ప్రిన్సిపాల్ కోప్పడటంతోనే తమ పిల్లలు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది. ఇదే విషయమై తల్లిదండ్రులందరూ కలిసి ఈస్టు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
విద్యార్థుల వివరాలను తీసుకున్న పోలీసులు వారి ఆచూకీ వెతికేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే ప్రిన్సిపాల్ మాత్రం పిల్లల విషయం తెలియదని, సినిమాకు వెళ్ళడంతో మందలించినట్లు తెలిపారు ప్రిన్సిపాల్. కొంతమంది ఇతర విద్యార్థులను కూడా ప్రశ్నించారు పోలీసులు.
 
అందరినీ విచారించిన తరువాత సినిమాకు వెళ్ళిన విషయం స్కూల్లో తెలిసిపోవడంతో ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు చెప్పి ఉంటారని ఇంటికి వెళితే వారు తమను కొడతారని భయపడే విద్యార్థులు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. అయితే మాయమైన విద్యార్థులంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారన్న విషయం మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విద్యార్థుల గురించి వారి బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులను కూడా విచారించారు పోలీసులు. 
 
పిల్లలు తమ ఇళ్ళకు రాలేదని వారంతా స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఆరుగురు విద్యార్థుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నగరంలోని సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఎలాగైనా తమ పిల్లలను తెచ్చి ఇవ్వండంటూ పేరెంట్స్ పోలీసులను కన్నీళ్ళతో వేడుకోవడం స్టేషన్‌లోని సిబ్బందిని కదిలించివేస్తోంది. వీరు ఆరుగురు విద్యార్థులు జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానులు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలైన మొదటి రోజు చూడటం వీరికి అలవాటు. అయితే ఆ అలవాటే ఈసారి వారి తల్లిదండ్రులకు క్షోభను కలిగిస్తోంది. ఎటు వెళ్లారో...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments