శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

సెల్వి
శనివారం, 22 నవంబరు 2025 (13:35 IST)
shivajyothi
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే.. అంటూ వ్యాఖ్యానించారు. 
 
పైగా ఇదేదో గొప్ప పని అయినట్టు ఈ సంభాషణను వీడియో తీసి, తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పవిత్రమైన ప్రసాదాన్ని అగౌరవపరిచిన శివజ్యోతి, ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
క్యూ లైన్‌లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments