Tirumala Adulterated Ghee Case: లడ్డూ నేతిలో కల్తీ... టీటీడీ ఉద్యోగులే అంత పనిచేశారా?

సెల్వి
శనివారం, 29 నవంబరు 2025 (19:31 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. 
 
తాజాగా ఈ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేర్చుతూ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయడం కలకలం రేపుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టిన సిట్ అధికారులు, ఈ కుంభకోణం మూలాలను వెలికితీసే పనిలో పడ్డారు. 
 
ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో తొలుత 15 మందిని నిందితులుగా గుర్తించారు. ఆ తర్వాత దర్యాప్తు లోతుగా సాగడంతో, మరో 9 మంది పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. తాజాగా, లభించిన సాక్ష్యాధారాల మేరకు మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటివరకు నిందితులుగా చేర్చబడిన వారి సంఖ్య మొత్తం 35కు చేరింది.
 
వీరిలో ఇప్పటికే 10 మందిని సిట్ అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, స్వామివారి సేవలో తరించాల్సిన టీటీడీ ఉద్యోగులే అక్రమాలకు పాల్పడడం. సిట్ వెల్లడించిన తాజా జాబితా ప్రకారం, నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులే ఉండడం గమనార్హం. 
 
ముఖ్యంగా 2019 నుండి 2024 మధ్య కాలంలో టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన అధికారులపై సిట్ దృష్టి సారించింది. వీరిలో సాధారణ గుమస్తాల నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు ఉండడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments