పేరుకు మాత్రమే టీచర్.. కానీ భార్యను వదిలిపెట్టి.. ప్రియురాలితో సంసారం

పేరుకు ప్రభుత్వ టీచర్ కానీ కట్టుకున్న భార్యను పక్కనబెట్టి ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో తన భర్త వేరొక మహిళతో జీవిస్తుండటాన్ని భార్య తట్టుకోలేకపోయింది.

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (15:58 IST)
పేరుకు ప్రభుత్వ టీచర్ కానీ కట్టుకున్న భార్యను పక్కనబెట్టి ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో తన భర్త వేరొక మహిళతో జీవిస్తుండటాన్ని భార్య తట్టుకోలేకపోయింది. అంతే భర్తతో పాటు.. ఆతడి ప్రియురాలిపై దాడిచేసింది. ఈ ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల మండలంలోని వెంకంపల్లిలోని స్కూల్‌లో సత్యనారాయణ స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. సత్యనారాయణకు ఇంతకుముందే పద్మతో వివాహమైంది. 
 
పద్మ, సత్యనారాయణ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కానీ ఏడాది నుంచి సంధ్య అనే మహిళతో సత్యనారాయణ సిరిసిల్లలో నివాసం ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ సతీమణి పద్మ బంధువులతో కలిసి దాడి చేసింది. సత్యనారాయణతో పాటు మరో మహిళను పద్మతో పాటు ఆమె బంధువులు చితక్కొట్టారు. 
 
కానీ సంధ్య మాత్రం తనను సత్యనారాయణ ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడని చెప్తోంది. ఈ విషయం సత్యనారాయణ మొదటి భార్య పద్మకు కూడ తెలుసునని  సంధ్య ఆరోపిస్తోంది. కానీ పద్మ మాత్రం ఇవన్నీ ఉత్తుత్తి మాటలేనని.. సత్యనారాయణ కోసం ఏడాది పాటు వెతికానని.. ఆచూకీ తెలుసుకున్నాకే.. సిరిసిల్లకు బంధువులతో వచ్చానని స్పష్టం చేసింది. అంతేగాకుండా సత్యనారాయణను భార్య పద్మ చెప్పుతోనే దాడి చేసింది. ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments