Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెల్లి ప్రేమిస్తున్నాడని యువకుడిని చితక్కొట్టి బావిలో పడేసిన సోదరులు

Webdunia
గురువారం, 21 మే 2020 (17:10 IST)
చెల్లెలిని ప్రేమిస్తున్న యువకుడిని ఆమె సోదరులు చితక్కొట్టి బావిలో పడేసిన ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన బింగి శ్రీకాంత్‌ హైదరాబాదులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరులు శ్రీకాంత్‌ను చంపేయాలనుకున్నారు. 
 
ఈ నెల 19న హన్‌మాన్‌ మాల విరమణకు శ్రీకాంత్‌ నర్సాయపల్లికి వచ్చాడు. ఇదే అదునుగా భావించిన యువతి సోదరులు బాల్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి శ్రీకాంత్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో ప్రాణాలు కోల్పోయాడని భావించి, యువతి అమ్మమ్మ గ్రామమైన కొండపాక మండలం బందారానికి తీసుకొచ్చి ఓ బావిలో పడేశారు.
 
బుధవారం సాయంత్రం బావిలోంచి శ్రీకాంత్‌ కేకలు వేయడంతో అటువైపు వెళ్తున్న మేకల కాపరులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు శ్రీకాంత్‌ను బావిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments