Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుపాటి జయరాం హత్య కేసులో ట్విస్ట్... తెరపైకి శిఖా ప్రియుడు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:40 IST)
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడు సంతోష్ పేరు తెరపైకి వచ్చింది. ఇపుడు ఈ సంతోష్ ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
జయరామ్ అమెరికా పౌరుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో రోజుకు ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. జయరామ్ హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్ అనే యువకుడితో ఆమె లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో సంతోష్‌ ఎవరనే విషయాన్నికూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే కుత్బుల్లాపూర్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, జయరాం హత్య తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ఓ పోలీసు అధికారులు సలహా ఇచ్చారు. వీరిని ఇప్పటికే విచారించారు. మరోసారి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులను పోలీసులు విచారించనున్నారు. ఇదిలావుంటే జయరామ్‌ హత్యకు నెలరోజుల ముందు చింతల్‌లో రూ.100 కోట్ల విలువైన డాక్యుమెంటేషన్ రాకేష్ రెడ్డిచేయించినట్లు గుర్తించారు. డాక్యుమెంట్‌ తయారీదారుల నుంచి వివరాలు పోలీసులు సేకరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments