Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాద్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌పై బదిలీ వేటు

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:31 IST)
షాద్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌పై బదిలీ వేటు పడింది. అధికారికంగా నిర్వహించిన పార్టీలో చిందులు వేయడంపై పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 
 
మీడియాతో పాటుగా పుర ప్రముఖులకు షాద్ నగర్ పోలీసులు గెట్ టుగెదర్ పార్టీ ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంలో పార్టీ పూర్తి అయిన తర్వాత ఇన్స్పెక్టర్‌తో పాటు మిగతా కొంతమంది అధికారులు కలిసి నాగిని డాన్స్ చేశారు. 
 
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి చేరడంతో సీపీ సజ్జనార్ వెంటనే విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్‌ని వెంటనే హెడ్ కోటర్స్‌కు బదిలీ చేశారు.  నిర్లక్ష్యంతో పాటు విధుల్లో క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో శ్రీధర్‌పై బదిలీ వేటు వేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
అలాగే ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని షాద్ నగర్ ఏసిపి సురేంద్ర సిపి ఆదేశించారు.  దిశ సంఘటన నేపథ్యంలో కీలకంగా వ్యవహరించిన శ్రీధర్ పై బదిలీ వేటు పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments