Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను అలా వేధించాడని ఆ తండ్రి ఏం చేశాడంటే....

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (14:06 IST)
చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సొంత బంధువుల నుంచో లైంగిక వేధింపులకు గురవుతున్నారు యువతులు. తండ్రి వయస్సైన వ్యక్తే లైంగికంగా వేధించడంతో యువతి కొన్ని రోజుల పాటు భరించింది. ఆ తరువాత తండ్రికి వివరించింది. దాంతో ఆ తండ్రి అలా చేసేశాడు.
 
వివరాల్లోకి వెళితే... చిత్తూరు రూరల్ మండలం చెన్నసముద్రం గ్రామంలో కేశవులు నివాసముండేవాడు. కేశవులకు ఒక కుమార్తె ఉంది. పేరు కళ్యాణి.  అదే ప్రాంతానికి చెందిన శేఖర్, కేశవులు ఇద్దరూ మంచి స్నేహితులు. ఐతే ఇంటికి వస్తూ తన స్నేహితుడి కుమార్తెపై కన్నేశాడు. లైంగికంగా వేధించాడు శేఖర్. కనిపించినప్పుడల్లా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. సంవత్సరం పాటు తన తండ్రి కేశవులకు విషయం చెప్పకుండా భరిస్తూ వచ్చింది కళ్యాణి. 
 
అయితే శేఖర్ ఆగడాలు మరింత మితిమీరిపోవడంతో కళ్యాణి విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేశవులు, శేఖర్‌ను చంపేయాలని ప్లాన్ చేశాడు. పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచాడు. శేఖర్ తన బాబాయ్ లక్ష్మయ్యను వెంట పెట్టుకుని కేశవులు చెప్పిన పొలాల వద్దకు వెళ్ళారు. 
 
ముగ్గురు కలిసి పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న శేఖర్‌తో కేశవులు గొడవ పెట్టుకున్నాడు. రాయితో తలపై మోదాడు. శేఖర్ చనిపోకపోవడంతో కత్తితో తల నరికాడు. అంతటితో ఆగలేదు శేఖర్ మర్మాంగాలను కోసేశాడు. విషయం బయటకు వస్తుందని శేఖర్ బాబాయ్ లక్ష్మయ్యను కూడా బండరాయితో కొట్టి చంపి పరారయ్యాడు కేశవులు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం