Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో కిల్లర్ కూడా ప్రేమించాడా.. అందుకే ఆ యువతిని చంపకుండా వదిలేశాడట..

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (10:43 IST)
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలిసిపోయి వుంటుంది. యువతులకు లిఫ్ట్ ఇచ్చి వారిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడి బావిలో పాతిపెట్టే సైకో కిల్లర్ అంటేనే జనం జడుసుకుంటున్నారు. అలాంటి సైకో కిల్లర్ ప్రేమించాడని వార్తలు వస్తున్నాయి. ప్రేమించిన కారణంగా ఓ యువతిని చంపకుండా వదిలిపెట్టేశాడని టాక్ వస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి... ముగ్గురు అమ్మాయిలను రేప్ చేసి, దారుణంగా హతమార్చి, బావిలో పూడ్చిపెట్టి... అలాగే కర్నూలులో ఓ సెక్స్ వర్కర్‌ని నలుగురితో కలిసి చంపి, తీవ్ర నేరగాడిగా నిలిచాడు. కానీ ఓ అమ్మాయిని మాత్రం చంపకుండా వదిలేశాడు.
 
ఏడాదిన్నరగా పరిచయం ఉన్న ఆ అమ్మాయి విషయంలో మాత్రం శ్రీనివాస్ రెడ్డి తొందరపడసేదు. దీనిపై రాచకొండ పోలీసులు దర్యాప్తు జరిపారు. శ్రీనివాస్ రెడ్డి ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ అమ్మాయితో కలిసి తీసుకున్న ఫొటోలు కనిపించాయి. ఆమె ఎవరని శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు.

ఆ యువతి సిరిసిల్ల జిల్లా, వేములవాడకు చెందినది. వేములవాడ ఆలయానికి వెళ్లినప్పుడు. ఆమెను చూశాడు. అలా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా భావించుకున్న శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకే ఆమె పట్ల ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడలేదని తెలిపాడు.
 
ఓవైపు ఆ ప్రేమాయణం నడిపిస్తూనే మరోవైపు ఈ వరుస హత్యోదంతాలకు పాల్పడుతూ కిరాతకుడిగా మారాడు. ప్రేమించిన యువతిని శ్రీనివాస్ రెడ్డి తరచూ వేములవాడకు వెళ్లి కలిసేవాడు. తనతో మాట్లాడుతున్నది ఓ సైకో కిల్లర్ అని తెలియని ఆ యువతి... శ్రీనివాసరెడ్డితో చక్కగా ఉండేదని తెలిసింది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అదృష్టవంతురాలు. పొరపాటున శ్రీనివాస్ ప్రేమను రిజెక్ట్ చేసి వుంటే... ఆమెను కూడా చంపేసేవాడేమోనని పోలీసులు చెప్తున్నారు. 
 
మరోవైపు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎవరితోనూ కలవకుండా, ఎప్పుడూ ముభావంగా ఉండే శ్రీనివాస్ రెడ్డి, తన మిత్రుడితో కలిసి ఓ బైక్‌పై విన్యాసాలు చేస్తూ వెళుతున్నాడు. 
 
గ్రామంలోకి ఎప్పుడు వచ్చినా కొత్త కొత్త బైక్‌లు తెచ్చి, రెండు మూడు రోజులు తిరిగి వెళుతుండే శ్రీనివాస్ రెడ్డి, బైక్‌పై వెనుక కూర్చుని ఉండగా తీసిన వీడియో ఇది. ఇటీవల ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇది తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో బైక్‌ను నడుపుతున్న మరో యువకుడి గురించి ఆరా తీస్తున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం