Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దెలచెర్వు సూరి హత్య కేసు : పరిటాల రవి ఫ్యామిలీ హస్తం? నేడు తీర్పు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (09:18 IST)
అనంతపురం జిల్లాకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం తుదితీర్పును వెలువరించనుంది. ఈ హత్య కేసులో టీడీపీ నేత దివంగత పరిటాల రవి కుటుంబం హస్తం ఉందని హతుని భార్య గంగుల భానుమతి ఆరోపిస్తూవస్తోంది. ఈ క్రమంలో సూరి హత్య కేసులో తుది తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. 
 
కాగా, 2011, జనవరి 3వ తేదీన సూరి, అతడి ప్రధాన అనుచరుడు, అల్లుడుగా భావిస్తూ వచ్చిన భానుకిరణ్, డ్రైవర్ మధులు జూబ్లీహిల్స్ నుంచి సనత్ నగర్ వైపు కారులో వెళుతున్నారు. అపుడు కొందరు పాయింట్ బ్లాంక్‌లో సూరిపై కాల్పులు జరిపి హతమార్చారు. 
 
ఈ కేసులో భూనుకిరణ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. అలాగే, డ్రైవర్ మధు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు విచారణ సాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పలువురు వాంగ్మూలంతోపాటు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఈ కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments