Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు!

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:45 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ లేఖ విషయంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

ఆధారాలు ధ్వంసం చేసినట్టు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్‌ సాంబ మూర్తి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారు.

ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం.

ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు.

లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తెలియదన్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పినట్టు లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.
 
ఆధారాలు ట్యాంపర్‌ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్‌ కుమార్‌  తెలిపారు. లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. కేంద్రంకు రాసిన లేఖ 221 నంబర్‌తోనే, అశోక్‌బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌కు కూడా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments