కుటుంబ సభ్యులను బెదిరించేందుకు ఉరేసుకున్న భర్త ... పొరపాటున ఉరి బిగుసుకోవడంతో...

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (09:20 IST)
విశాఖపట్టణంలో ఓ విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. తన మాట ఏమాత్రం పట్టించుకోకుండా, పదేపదే విసిగిస్తున్న భార్యా, పిల్లలను బెదిరించేందుకు ఓ భర్త మెడకు ఉరి బిగించుకున్నాడు. అది కాస్త పొరపాటున గట్టిగా బిగుసుకుని పోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ గోపాలపట్నం పోలీసుల కథనం ప్రకారం, బీహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్. ఐదేళ్ల నుంచి 89వ వార్డు కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. బుధవారం రాత్రి కుమార్తె (7), కుమారుడు (5) ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. పిల్లలపై చిరాకు పడుతున్న చందన్ కుమార్‌కు భార్య అడ్డుపడింది.
 
ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవైంది. తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ కుమార్ బెదిరించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో, ఆయన ఇంట్లోని ఫ్యానుకు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబసభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక గిలగిల్లాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కప తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

Sai tej: సంబరాల ఎటుగట్టుతో రాక్షసుల రాక వచ్చిందని సాయి దుర్గా తేజ్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments