Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకు తొలి రోజు వైద్యపరీక్షలు పూర్తి... షీల్డు కవర్‌లో సుప్రీంకు...

Webdunia
బుధవారం, 19 మే 2021 (14:52 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో తొలి రోజు నిర్వహించిన వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వీటిని సంబంధించిన రిపోర్టులను షీల్డు కవర్‌లో సుప్రీంకోర్టుకు చేరవేశారు. అలాగే, రెండో రోజైన బుధవారం కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. 
 
ముఖ్యంగా, రఘురామ అరికాళ్లకు అయిన గాయాలపై మంగళవారం నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. 
 
సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు.
 
మరోవైపు, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments