Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు రైతులను కష్టాల నుంచి గట్టెక్కించిన మంత్రి గౌతమ్ రెడ్డి

Webdunia
శనివారం, 9 మే 2020 (21:41 IST)
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయి ఆందోళన చెందుతున్న పొగాకు రైతులను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గట్టెక్కించారు.

రోజురోజుకి రంగుమారి, కొనుగోలు జరుగుతుందో లేదోనని మొరపెట్టుకున్న రైతుల కష్టం విని చలించిపోయారు. తాజాగా జిల్లా  అధికార యంత్రాంగంతో ఈ అంశంపై చర్చించినా కరోనా పాజిటివ్ కేసులు, పొగాకు బోర్డు ఉన్న మర్రిపాడు మండలంలోని డీసి పల్లి  ప్రాంతం రెడ్ జోన్ కావడంతో కొనుగోలు ప్రారంభం కుదరలేదు.

తాజాగా మంత్రి గౌతమ్ రెడ్డి టొబాకో బోర్డు అధికారులతో చర్చించడంతో పాటు, జిల్లా కలెక్టర్ కు పొగాకు కొనుగోళ్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో శరవేగంగా శుక్రవారం ఎం.వీ శేషగిరి బాబు జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాలైన డీసీ పల్లి, కలిగిరిలను గ్రీన్ జోన్ గా ప్రకటించి పొగాకు కొనుగోళ్లు  మే నెల 11వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించాలని మార్గదర్శకాలిచ్చారు.

సుమారు 45 రోజులుగా లాక్ డౌన్ కారణంగా పొగాకు కొనుగోళ్లు ఎక్కడికక్కడ  నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తుల అంశంలో వెసులుబాటు కలిగించడం, డీసీ పల్లిలోని పాజిటివ్ కేసులు నెగటివ్ గా మారడం, మర్రిపాడు ప్రాంతం గ్రీన్ జోన్ పరిధిలోకి రావడంతో మంత్రి గౌతమ్ రెడ్డి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వడం పొగాకు రైతుల్లో కొండంత భరోసా నింపింది.

అయితే, పొగాకు కొనుగోళ్ల సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా రైతులు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. వాక్సిన్ వచ్చేవరకూ ఈ జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించడం అలవాటు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

అందుకు అనుగుణంగా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని, రైతులందరి పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments