Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం లేకుండా తేళ్ళ పండుగ ... శ్రీవారికి నైవేద్యంగా తేళ్లు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:37 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి భయం ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. నలుగురు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలన్నా భయపడిపోతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయం. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ భయం లేకుండా గ్రామస్థులంతా కలిసి తేళ్ళ పండుగను జరుపుకున్నారు. పైగా, ఈ తేళ్ళను శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లాలోని కోడుమూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రతి యేడాది శ్రావణ మాసం మూడో సోమవారం తేళ్ళ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ గ్రామస్థులంతా కలిసి వరుస క్రమంలో కొండపై తేళ్లను గాలిస్తూ వెళతారు. అలా గాలింపు చర్యల్లో వారికి లభ్యమయ్యే తేళ్లను కొండపై వెలసిన శ్రీ కొండరాయుడు (శ్రీ వేంకటేశ్వర స్వామి)కి నైవేద్యంగా పెడుతారు. 
 
ముఖ్యంగా, కొండపైకి వెళ్ళే భక్తులు కొండ రాళ్ళ కింద తేళ్ళను పట్టుకుని వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత స్వామికి భక్తితో పూజలు చేసి దర్శనం చేసుకుంటారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తున్న సమయంలోనూ వారు ఏమాత్రం భయపడకుండా తమ ఆచారాన్ని కొనసాగించారు. మిగిలిన రోజుల కంటే ఈ ఒక్క రోజు మాత్రం కొండపైకి వెళ్లే భక్తులు తేళ్లు ఎలాంటి హాని తలపెట్టవని కొడుమూరు గ్రామస్థులు చెబుతున్నారు. అంటే.. భక్తితో పాటు.. తేళ్ళపై వారికి అపారమైన భక్తి విశ్వాసమన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments