వైజాగ్ -సింగపూర్ స్కూట్ విమాన సర్వీసులు పున‌:ప్రారంభం

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:31 IST)
విశాఖ నుంచి సింగపూర్ కు స్కూట్ విమాన సర్వీసును ఎంపి ఎంవివి సత్యనారాయణ, జీవీఎంసీ డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. విమానాశ్రయ టెర్మినల్ భవనంలో జ్యోతి ప్రజ్వళన చేసి విమాన స‌ర్వీసును ప్రారంభించారు. తొలిరోజు ప్రయాణికులకు ఎంపి ఎంవివి సత్యనారాయణ టికెట్లను అందించారు.
 
 
స్కూట్ విమానం గతంలో 2019 లో ప్రారంభమయింది.  ఆ తరువాత కోవిడ్ కారణంగా మార్చిలో నిలిపివేశారు. ఇపుడు ప్రత్యేకంగా బబుల్ ఆపరేషన్ ద్వారా తిరిగి సింగపూర్కు స్కూట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎప్పటి నుంచో ఈ సర్వీస్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఇదొక శుభవార్తయింది. ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వారానికి మూడు రోజులు విమానం నడుస్తుందన్నారు. బుధవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఉదయం 10.10 గంటలకు విశాఖ వస్తుంద‌ని, 11 గంటలకు బయలు దేరుతుందని తెలిపారు. 
 
 
తొలి రోజు కొందరు ప్రయాణికులు ఢిల్లీ నుంచి వచ్చి, ఇక్కడ ఈ విమానంలో సింగపూర్ వెల్తున్నారని  తెలిపారు. తొలి రోజుల్లో తక్కువ మంది ప్రయాణికులు వచ్చారని, ఈ రోజు 20 మంది ప్రయాణికులు మాత్రమే విశాఖ నుంచి వెళ్తున్నార‌ని, రాను రాను ఈ విమానానికి ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments