Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిజేరియన్‌ చేస్తూ కత్తెరను మరిచిపోయారు.. బాలింతకు ఏమైందంటే?

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (11:42 IST)
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సిజేరియన్‌ ద్వారా ప్రసవించిన ఓ గర్భిణి కడుపులోనే కత్తెరను మరిచి వదిలేశారు వైద్యులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
ఒక వారం క్రితం డెలివరీ కోసం గర్భిణీ మహిళ ఆసుపత్రిలో చేరింది. సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ నిర్వహించిన సిజేరియన్‌ ఆపరేషన్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు బాగానే వుంది కానీ ఆపరేషన్ అయ్యాక కుట్లు వేసే క్రమంలో వైద్యులు బాలింత కడుపులోనే కత్తెరను మరిచిపోయారు.  
 
అయితే కడుపులో నొప్పి వేధించడంతో ఆ మహిళ తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌లో ఆమె కడుపులో కత్తెర వుండటాన్ని గమనించారు. 
 
ఆసుపత్రికి చెందిన ఓ ఉద్యోగి తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో ఎక్స్-రే ఫోటోను షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments