Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు... పాఠశాలలకు సెలవు

ఠాగూర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (12:52 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఐదు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవు పర్కటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. 
 
మరోవైపు, గురువారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు నుంచి వైజాగ్ వరకు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలు హెచ్చరించారు. చేపల వేట సముద్రంలోకి వెళ్లినవారు తక్షణం తీరానికి తిరిగి రావాలని వారు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments