Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (15:24 IST)
ఏపీలో త్వరలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రం మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. 
 
ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.
 
నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 2 నుంచి 9, 10, 11/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు.
 
డిసెంబర్‌ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments