Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ వీరాభిమాని బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే, ఆయన సోదరుడు శివబాబుపై కూడా ఈ సెక్షన్ ప్రయోగించారు.

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (17:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే, ఆయన సోదరుడు శివబాబుపై కూడా ఈ సెక్షన్ ప్రయోగించారు. తమకు రావాల్సిన డబ్బులను ఇవ్వాలని అడిగినందుకు కులం పేరుతో తమని దూషించారంటూ కౌన్సిలర్ కృష్ణవేణి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 
 
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కి చెందిన డాక్టర్ దిలీప్‌చంద్ర‌కి ఫరూఖ్‌నగర్ మండలం, బూర్గుల శివారులో భూముల, పౌల్ట్రీలు ఉన్నాయి. వీటన్నింటినీ బండ్ల గణేష్ కొనుగోలు చేసేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే, ఆ భూములపై బ్యాంకుల్లో అప్పటికే రుణాలు ఉండటంతో వాటిని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒప్పందం‌లో స్పష్టంగా పొందుపరిచారు. 
 
అయితే సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఆ భూములతో పాటు దిలీప్ చంద్ర ఇంటిని కూడా సీజ్ చేశారు. అనంతరం బండ్ల గణేశ్ సోదరుల ద్వారానే ఆ ఆస్తులన్నింటినీ విక్రయించారు. విక్రయించిన తర్వాత వారికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈనేపథ్యంలో డాక్టర్ దిలీప్ చంద్ర, తన భార్య కౌన్సిలర్ కృష్ణవేణి‌తో కలిసి గణేశ్ పౌల్ట్రీ ఫాం కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ గణేశ్, శివబాబు తమని దూషించారంటూ కృష్ణవేణి‌ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గణేశ్‌ సోదరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు స్థానిక ఏసీపీ సురేందర్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments