Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైకాపా అభ్యర్థుల వివరాలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (20:53 IST)
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించినట్టు చెప్పారు.
 
విజయనగరం జిల్లా నుంచి రఘురాజు, విశాఖపట్నం నుంచి ఒరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్ కుమార్‌, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు, అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్‌ను సీఎం జగన్ ఎంపిక చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
 
బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అనడం సరికాదు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ మాటలు ఆయన మంత్రులు వినలేదేమో. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పద్ధతి. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు? అని సజ్జల వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments