Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలువలో దూకి మరీ నిందితుడి ప‌ట్టివేత‌...శ‌భాష్ ర‌ఫీ

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (12:58 IST)
కాలువ‌లోకి దూకి మ‌రీ నిందితుడిని వెంబడించి ప‌ట్టుకున్న కానిస్టేబుల్ ర‌ఫీని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. గుంటూరు అర్బన్ పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని ర‌మ్య హత్య కేసులో కీల‌క నిందితుడు శ‌శి కృష్ణ‌ను కానిస్టేబుల్ ర‌ఫీ చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నాడు.

పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ ని రూర‌ల్ ఎస్పీ విశాల్ గున్ని కొనియాడారు. కాలువలో దూకి మరీ ముద్దాయిని వెంబడించి, అత‌డు మారణాయుధంతో బెదిరించినా వెన్నుచూపని ధీరత్వం త‌న‌ను ఆక‌ర్షించింద‌న్నారు. ర‌ఫీ నేర్పరితనంతో పోలీస్ శాఖకు కీర్తిప్రతిష్ఠలు తెచ్చాడ‌న్నారు. అతని ధైర్య సాహసానికి మెచ్చి రూ. 5000 నగదు రివార్డ్, ప్ర‌శంసా పత్రం అందించారు.

విధి నిర్వహణ పట్ల అంకితభావం కలిగిన సిబ్బంది రూరల్ జిల్లాలో ఉండటం గర్వకారణమ‌న్నారు. తన సిబ్బందిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ముప్పాళ్ళ ఎస్సై పట్టాభిరామయ్యని కూడా ఎస్పీ అభినందించారు. పోలీస్ అధికారులు ఇటువంటి సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో రఫీ చూపిన తెగువ గుంటూరు రూరల్ జిల్లా పోలీసులకే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకే గర్వకారణమ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)

తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)

6 నుంచి "పుష్ప" కోసం శ్రీలీల - అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ?

అమెరికాలో మృతి చెందిన మిథున్ చక్రవర్తి తొలి భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments