Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదాపై అమీతుమీ నేడే... కేవీపీ బిల్లుపై చర్చకు 2 గంటల సమయం కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగనుంది. ఈ బిల్లుపై చర్చించేందుకు 2 గంటల సమయం కేటాయించారు.

Webdunia
గురువారం, 28 జులై 2016 (08:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో గురువారం చర్చ జరుగనుంది. ఈ బిల్లుపై చర్చించేందుకు 2 గంటల సమయం కేటాయించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్ బిల్లుపై చర్చ లేకుండా, ఓటింగ్ జరగకుండా అడ్డుకోవాలని బీజేపీ తీవ్రంగా యత్నించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టి.. సభను స్తంభింపజేసింది. ఇంతలో రంగ ప్రవేశం చేసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అది ద్రవ్య బిల్లు అని, రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని ప్రకటించారు. దీంతో ప్రత్యేక హోదా అంశంపై నీళ్లు గుమ్మరించారు. 
 
కానీ బుధవారం శరవేగంగా రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై గురువారం రాజ్యసభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆయా పార్టీల సభాపక్ష నేతల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. చర్చకు అంగీకరించిన సభానాయకుడు జైట్లీ.. చర్చ తర్వాత ప్రత్యేక హోదాపై కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకోవాలని షరతు విధించారు. ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా ఉంటే బిల్లును వాపస్‌ తీసుకోవాలని కేవీపీని కోరతామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments