Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగుల ఆర్టీజీఎస్ హెచ్చరిక

Webdunia
గురువారం, 18 జులై 2019 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) వెల్లడించింది. ముఖ్యంగా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. ఇదే అంశంపై ఆర్జీటీఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖప‌ట్నం, ప్ర‌కాశం, కృష్ణా జిల్లాల్లో ప‌లు మండ‌లాల్లో పిడుగుల వర్షం కుర‌వ‌నుంది. రాగ‌ల 40 నిమిషాల్లో ఈ రెండు జిల్లాలలో పిడుగులు ప‌డ‌నున్నాయని పేర్కొంది. 
 
విశాఖ ప‌ట్నం జిల్లాలోని పెద్ద‌బ‌య‌లు, ముంచింగిపుట్టు, న‌ర్శీప‌ట్నం, ప్ర‌కాశం జిల్లాలో బేస్త‌వారిపేట, రాచ‌ర్ల, త‌ర్లుపాడు, అర్ధ‌వీడు, గిద్ద‌లూరు, హ‌నుమంతుని పాడు, వెలంగండ్ల, కృష్ణా జిల్లాలో తిరువూరు, విస‌న్నపేట, చాట్రాయి, గోపాల‌గూడెం, ఏ కొండూరు, రెడ్డి గూడెం, నూజివీడు, ముసునూరు, బాపుల పాడు, ఆగిరిప‌ల్లి, జి కొండూరు, మైల‌వ‌రం, ఉంగ‌టూరు, విజ‌య‌వాడ అర్బ‌న్, రూర‌ల్ , పెన‌మ‌లూరు, గ‌న్నవ‌రం మండలాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అందువల్లఈ ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల్లో త‌ల‌దాచుకోవాలి బ‌య‌ట ప్రాంతాల్లో సంచ‌రించ‌రాదని, చెట్ల కింద ఉండ‌టం ప్ర‌మాద‌క‌రని ఆర్టీజీఎస్ విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments