ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు...

గురువారం, 18 జులై 2019 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలో తిష్ఠ వేసిన తూర్పు, పడమర ద్రోణి తూర్పు భాగం వాయువ్య బంగాళాఖాతానికి చేరింది. ఇదేసమయంలో అరేబియా సముద్రంలో రుతుపవన కరెంట్‌ ప్రభావంతో పడమర గాలులు వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో బుధవారం ఒడిసా, బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో వర్షాల జోరు పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఉంది. కాగా, బుధవారం రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 24న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం