Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలి:కెవిపిఎస్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (21:26 IST)
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి కుటుంబానికి జీవనభృతి కోసం 7500 రూపాయలు ఇవ్వాలని కేరళ తరహా 17 నిత్యవసర వస్తువులను ఉచితంగా పేదలకు పంపిణీ చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎం రవి డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు రాజధాని గ్రామమైన వెంకటపాలెం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహల ఎదుట కెవిపిఎస్ రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం నుద్దేశించి రవి మాట్లాడుతూ.. గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యం గోధుమలు తదితర  నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. రాజధానిలో కూలీలు పేదలకు ఉపాధి చూపించాలని అన్నారు.

అసైన్డ్  భూమి సాగుదారులు అయిన పేదలకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని కోరారు మద్యం వలన పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని తక్షణం మధ్యాన్ని నిలిపివేయాలని రవి డిమాండ్ చేశారు.

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యాపిత పిలుపులో భాగంగా వెంకటపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాజధాని డివిజన్ నాయకులు జి. కృష్ణ, కె ఆంజనేయులు ఎం. నాగరాజు,  కృష్ణారావు  తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments