Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడి... ఇంటెలిజెంట్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ ప్రతిపాదన

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (06:25 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డితో హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఎస్‌.ఈ.జెడ్‌. డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌వేర్‌ తయారీ కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి( ఎస్‌.ఈ.జెడ్‌) ఏర్పాటు పై చర్చించారు. ఈ ఆర్ధిక మండలి ఏర్పాటుకు  రూ.700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇంటెలిజెంట్‌ ఎస్‌.ఈ.జెడ్‌ ప్రతినిధులు చెప్పారు.

అనుమతి ఇచ్చిన ఐదేళ్లలోగా రూ.350కోట్ల రూపాయల ఖర్చుతో మొదట విడత పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారు. విస్తరణ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఇన్వెస్టిమెంట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్ధే ఇంటెలిజెంట్‌ ఎస్‌.ఈ.జెడ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్‌ బ్రాండ్‌ ఉత్పత్తులు ఈ సంస్ధ నుంచే వస్తున్నాయి. భారత్, చైనా, వియత్నాం దేశాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 
 
రూ. 1750 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్లను నిర్వహిస్తూ 25వేల మందికి ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలిస్తోంది. 

నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్‌వేర్‌ ఎస్‌.ఈ.జెడ్‌ లో ఇంటెలిజెంట్‌ సంస్ధ భాగస్వామి. ఏపీలో 2006 నుంచి ఈ సంస్ధ నెలకు 12 లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 11వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. 

అలాగే వియత్నాంలో కూడా ఏడాదికి 50లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆ దేశంలో దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments