Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంధ‌న శాఖ‌కు రూ.6వేల కోట్లు బ‌కాయిలు .. సీఎస్ ఎల్వీ

ఇంధ‌న శాఖ‌కు రూ.6వేల కోట్లు బ‌కాయిలు .. సీఎస్ ఎల్వీ
, బుధవారం, 16 అక్టోబరు 2019 (06:38 IST)
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు ద్వారా ఇంధన శాఖకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై మంగళవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా ఇంధన శాఖకు సుమారు రూ.6వేల కోట్ల వరకూ విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని వాటిని అందుబాటులో ఉన్న వనరులను సమకూర్చుకుని సకాలంలో చెల్లించేందుకు చర్యల తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యంగా జలవనరులు శాఖ ద్వారా రూ.2వేల కోట్లు, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రూ.500 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉండగా మిగతా మున్సిపల్ పరిపాలన, వైద్య ఆరోగ్య తదితర శాఖల నుండి బకాలు చెల్లించాల్సి ఉంది.

గ్రామ పంచాయితీలు అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్ నిధుల నుండి విద్యుత్ బకాయిలు చెలించేలా చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ఆదేశించారు. అలాగే జలవనరుల శాఖకు సంబంధించి చెల్లించాల్సిన విద్యుత్ బకాలు వాటర్ గ్రిడ్ పధకంలో పొందుపర్చాలని చూచించారు.

వెంటనే కొంత మొత్తాన్ని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ను సిఎస్ ఆదేశించారు. విద్యుత్ బకాయిలకు సంబంధించి ఆర్ధిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు త్వరగా ఆమోదించాలని ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌ను సిఎస్ ఆదేశించారు.

మంచినీటి వృధాను నియంత్రించేందుకు ప్రతి రిజర్వాయర్, గ్రామ స్థాయిలోను, వాటర్ పంపింగ్ స్టేషన్‌ల పరిధిలో బల్క్ ప్లో మీటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అలాగే వాటర్ ఆడిట్‌ను తప్పక నిర్వహించాలని ప్రతి నీటి బొట్టు సద్వినియోగం అయ్యేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.

సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కార్తికేయ మిశ్రా, జలవనరుల శాఖ ఇఎన్సి యం.వెంకటేశ్వరరావు, ట్రాన్సుకో జెఎండి చక్రధరబాబు, ఇతర ఇంధన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు చరిత్ర మార్చే గొప్ప పథకం.. జగన్‌