Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీకి అసలైన వారసుడు మోడీనే

Advertiesment
గాంధీకి అసలైన వారసుడు మోడీనే
, బుధవారం, 16 అక్టోబరు 2019 (06:25 IST)
గాంధీజీ  సంకల్పయాత్ర  "మన్ మే బాపూజీ" ప్రముఖ్ శ్రీ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు జిల్లా కావలిలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  'మహాత్మాగాంధీ కి నేడు అసలైన వారసుడు మోడీనే. ఆయన చేసినటువంటి ఉద్యమాలు,స్వాతంత్ర్య పోరాట పటిమ ,దేశ భద్రతవంటి పలు విషయాల్లో గొప్పతనాన్ని ప్రజాల్లోకి తీసుకెళుతున్నరు. నరేంద్రమోదీ చెప్పాలంటే వాస్తవ పరిస్తులకు ప్రస్తుత అభినవ గాంధీ మోడీయే' అని కొనియాడారు.

ఆయన అహింసా మార్గం,నివాసిత ప్రాంతాల పరిశుభ్రత పట్ల గాండీజీ చూపిన మార్గాన్నే పరమావధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమల్లో ఉంచారని కొనియాడారు. రాష్ట్రంలో తెదేపా పని అయిపోయిందని, రేపు రాష్ట్రంలో భాజాపానే ప్రత్యామ్నాయమని గుర్తు చేశారు.

ప్రస్తుతం తెదేపా నాయకులు భాజాపా వైపే మొగ్గు చూపుతున్నారని, వారిని కట్టడి చేసే ప్రయత్నమే మొన్న విశాఖలో కేంద్రంతో పేచీ కొంపముంచించింది అని అసందర్భ ప్రకటనలు ద్వారా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవాచేశారు. తెదేపాపై ఎన్నికల ముందే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శాశ్వతంగా ద్వారాలు మూసేసామని ప్రకటించామని తెలియజేసరన్నా సంగతి గుర్తు చేశారు.

అక్టోబర్ 31 వరకు సంకల్ప యాత్ర ఉంటుందని, రోజుకు  10 నుండి 15 కిలోమీటర్ల మేర జాతీయ నాయకులు,రాష్ట్ర పదాధికారులు,ఎమ్మెల్సీ లు 150 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా గాంధీ మార్గాలను,శాంతి,పరిసరాల శుభ్రత కై స్వచ్ భారత్ వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ పాదయాత్ర సాగుతోందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రసంగించారు.

అనంతరం కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్టనాయకులు సురేష్ రెడ్డి మరియు యం, యల్, సి వాకాటి, తదితరులు పాల్గోన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం