Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బొమ్మతో రూ.వంద నాణెం.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్వర్గీయ ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ బొమ్మతో కూడిన వంద రూపాయల నాణెంను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం అధికారికంగా ఓ గెజిట్‌ను కూడా జారీ చేసింది. ఈ నాణెం 44 మిల్లీ మీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి, 40 శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం ఇతర లోహాలు ఉంటాయని కేంద్రం వివరించింది. 
 
ఈ నాణెంకు ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం, మరోవైపు, ఎన్టీఆర్ ఫోటో చిత్రం దాని కింద శ్రీ రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923 - 2023 అని ముద్రిస్తారు. ఈ విషయాన్ని కేంద్రం జారీచేసిన గెజిట్‌లో వివరించింది. ఉగాది పండుగ రోజున ఈ విషయం వెల్లడించడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments