Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారుపై ఆర్ఆర్ఆర్ ఫైర్.. సాక్షుల్ని కాపాడండి..

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (12:42 IST)
ఏపీ సర్కారుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డదారుల్లో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల లిక్కర్ బాండ్స్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. 
 
మార్జిన్ పేరుతో బెవరేజ్‌ కార్పొరేషన్‌కు ఆదాయాన్ని చూపించారన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, లిక్కరుపై ఎలాంటి ఆదాయం వచ్చినా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు. ఈ ఆదాయంపై బ్యాంకుల వద్ద ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు చెప్పారు.  
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి మృతిపై రఘురామ స్పందించారు. సాక్షి గంగాధర్ రెడ్డి మరణంపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. ఇప్పటివరకూ ముగ్గురు సాక్షులు చనిపోయారని.. ఉన్న సాక్షులనైనా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 
 
జూలై 4న ప్రధాని మోదీ పర్యటన ఉందని, ఆ సందర్భంగా తన నియోజకవర్గానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు రఘురామ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments