Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పజ్జీ గేమ్‌‍లో ఓడిపోయాడని బాలుడు ఆత్మహత్య

Advertiesment
suicide
, ఆదివారం, 12 జూన్ 2022 (19:05 IST)
ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ గేములో ఓడిపోవడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మృతుని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. పబ్జీ గేమ్‌లో ఓడిపోయాడంటూ స్నేహితులు హేళన చేయడంతో.. దాన్ని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్​లో పబ్జీ గేమ్ ఆడుతూ వచ్చాడు. అయితే, ఈ గేమ్​లో ప్రభు ఓడిపోయాడు. దీంతో ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. స్నేహితుల మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలుడు తన ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఊహించని కుమారుడి చర్యతో ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఆనందం పంచాల్సిన ఆట.. ఆ కుటుంబంలో విషం చిమ్మడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంటా రావొద్దని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13 నుంచి తెలంగాణాలో పాఠశాలలు ప్రారంభం : సబితా ఇంద్రారెడ్డి