Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, నారా లోకేష్ పైన రోజా తీవ్ర విమర్శలు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (20:08 IST)
ప్రతిపక్షనేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రోజా. రోజుకొక మాట్లాడుతున్న చంద్రబాబును ఎవరూ నమ్మరని.. క్రిందిస్థాయి టిడిపి నేతలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలెప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడుతారో ఆయన కన్నా అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు.

 
చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో రోజా మాట్లాడారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి చంద్రబాబు ఒక మాట మాట్లాడతారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోసారి మాట్లాడుతారు. చంద్రబాబుకు పిచ్చెక్కింది.

 
ఖచ్చితంగా ఆయన్ను పిచ్చాసుపత్రికి పంపించండి.. చికిత్స చేయించండి అంటూ రోజా ఫైరయ్యారు. మరోసారి ప్రభుత్వంపై టిడిపి నేతలు లేనిపోని విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
 
పట్టాభి మాటల తరువాత రాష్ట్రంలో అలజడి రేగింది. అందుకు పూర్తి కారణం చంద్రబాబే. నేతలను రెచ్చగొట్టడం.. విమర్సలు చేయించండి.. ముఖ్యమంత్రిపైనా, ఆయన తల్లిపైనా మాట్లాడడం.. ఇదంతా నిజంగా చూస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు మారరు. 

 
అతనిలో మార్పు రాకపోగా మరో పప్పు దాపురించాడు. ట్విట్టర్ పప్పు ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు తళుక్కున మెసేజ్ పెట్టి వెళ్ళిపోతాడు. అది అతని పరిస్థితి. తెలుగుదేశం గురించి మాట్లాడడం అనవసరం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకెళుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఎంత రాద్దాంతం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments