Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ప్రజలను హెచ్చరించిన రోజా.. డిసెంబర్ 2వ తేదీ..?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (23:11 IST)
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నివార్ తుఫాన్ బాధితులను జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారన్నారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. తిరుపతి విమానాశ్రయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ నివార్ తుఫాన్ లో 33శాతం డ్యామేజ్ అయిన రైతులకు విత్తనాలపై 80శాతం సబ్సిడీ కింద అందించమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.
 
బాధితులను ఆదుకోవడం.. పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు శాయశక్తులా కృషి చేశారని.. వారిని కూడా ముఖ్యమంత్రి అభినందించినట్లు చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ లోగా వరద బాధితుల అకౌంట్లలోకే నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో విపత్తులు వచ్చాయని.. కానీ అలాంటి విపత్తులను ఎదుర్కొని నష్టపోయిన వారిని ఏమాత్రం ఆదుకోలేదన్నారు.
 
అలాంటి రైతులను, బాధితులను సిఎం 1800 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నట్లు రోజా చెప్పారు. అలాగే ఈ నెల 29 వ తేదీన మరొక తుఫాన్, డిసెంబర్ 2వ తేదీన మూడవ తుఫాన్ వస్తుండడంతో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కాపాడాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రోజా చెప్పారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments