Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద రాకెట్ దాడి.. వాహనం నుంచి ప్రయోగం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (10:51 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆ దేశంలో అల్లకల్లో పరిస్థితులు నెలకొనివున్నాయి. తాలిబన్ల పాలనలో ఉండలేమని భావించిన అనేక మంది దేశం వీడి పోతున్నారు. ఇలాంటి వారితో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. కాబూల్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరుగొచ్చంటూ అమెరికా నిఘా సంస్థ హెచ్చరించి 24 గంటలు తిరగకముందే రాకెట్ దాడి జరిగింది. 
 
ఇటీవల జ‌రిగిన భారీ ఉగ్ర‌దాడి జరిగింది. ఈ దాడి ఘటనను మ‌ర‌ువ‌క ముందే సోమవారం ఉద‌యం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది. ఉగ్ర‌వాదులు ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. 
 
ఈ దాడితో అక్క‌డ ప‌రిస‌రాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. అమెరికా, నాటో ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌లో ఇంకా కొంత మంది మాత్ర‌మే ఉన్నారు. వారు కూడా వెళ్లాక ఆఫ్ఘ‌న్‌లో ఎటువంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments