Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 31 రాత్రి నుంచి జూబ్లీహిల్స్‌లో స్మార్ట్ రోబో పోలీస్- దేశంలో తొలి?

కొత్త సంవత్సరం వేడుకలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో స్మార్ట్‌ రోబో పోలీస్ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఆదివారం (డిసెంబర్ 31)న జూబ్లీహిల

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (17:31 IST)
కొత్త సంవత్సరం వేడుకలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో స్మార్ట్‌ రోబో పోలీస్ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. ఆదివారం (డిసెంబర్ 31)న జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో రాత్రి నుంచి రోబో విధులను ప్రారంభించనుంది.

అచ్చం మనిషిలాగే అటుఇటూ కదులుతూ పనిచేసే ఈ రోబో పోలీసు, ప్రజలను పలకరిస్తుంది, గుర్తు పడుతుంది, ఫిర్యాదులను విని సమాధానాలు కూడా ఇస్తుంది. అనుమానితులను గుర్తిస్తుంది. అలాగే బాంబులను గుర్తిస్తుంది. 
 
హైదరాబాదులోని టీహబ్‌లో స్టార్టర్ కంపెనీ హెచ్-బోట్స్ రోబోటిక్స్ బీటా వెర్షన్  రోబో పోలీసును రూపొందించింది. ప్రపంచంలో ట్రాఫిక్ విధులను నిర్వహించే రెండో రోబో పోలీసుగా ఇది చరిత్రకెక్కనున్నట్టు గత జూలైలోనే హెచ్-బోట్ ప్రకటించింది. ఇప్పటికే తొలి రోబోను పోలీసును ఫ్రాన్స్‌లో రూపొందించి దుబాయ్‌కి తరలించారు. దుబాయ్‌లో ప్రస్తుతం రోబో పోలీసు విధులను నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం